- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంట్లో దొంగతనానికి పాల్పడిన తల్లి, కొడుకుల అరెస్ట్
దిశ, చార్మినార్ : చేసిన అప్పు తీర్చుకోవడానికి పనిచేస్తున్న ఇంట్లోనే దోపిడీకి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న తల్లీకొడుకులను రెయిన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో మీర్ చౌక్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు వివరాలు వెల్లడించారు. పాతబస్తీ నాగబౌలి కోట్ల అహశాన్ ఉల్లాఖాన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మజీరుద్దీన్ ఈ నెల 1వ తేదీన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అంత్యక్రియల నిమిత్తం నల్గొండ కు తరలి వెళ్ళాడు. ఈ నెల 2వ తేదీన ఉదయం 10గంటలకు ఇంట్లోని బీరువా తెరిచి ఉందని తన బావమరిది కొడుకు నుంచి మజీరుద్దీన్ కాల్ కు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూడగా పెద్ద ఎత్తున బంగారంతో పాటు నగదును దోచుకెళ్ళినట్లు మజరుద్దీన్ రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో అతని ఇంట్లోనే కొంత కాలంగా పనిచేస్తున్న యాకుత్‌పురా కు చెందిన షేక్ జరీనా (45) పనిమనిషిగా చేరింది. అమెను పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన యజమాని ఇంట్లో బీరువాలో పెద్ద ఎత్తున బంగారం ఉన్నట్లు తన కుమారుడు షేక్ ఇర్షాద్ (22)కు చెప్పింది. దీంతో వారిద్దరూ యజమాని ఇంట్లో దొంగతనం చేయాలని, ఆ సొత్తుతో తన అప్పులు తీర్చుకోవాలని పథకం పన్నారు. ఈ నేపధ్యంలోనే ఇంటి యజమాని నల్గొండ కు వెళ్ళడాన్ని ఇదే అదనుగా తల్లీ కొడుకులు భావించారు. ఈ నెల 1వ తేదీన రాత్రి 11గంటలకు షేక్ ఇర్షాద్ శ్మశాన వాటిక నుంచి ఇంటి వెనుక ఉన్న వెంటిలేషన్‌ను తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. బంగారంతో పాటు ఒక లక్ష రూపాయల నగదును దొంగిలించి పరారయ్యాడు. దీంతో తల్లి కొడుకులను రెయిన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో రెయిన్ బజార్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ వి.మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.