AP News:విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు: ఆర్డీవో

by Jakkula Mamatha |
AP News:విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు: ఆర్డీవో
X

దిశ ప్రతినిధి, బాపట్ల: ఇసుక అక్రమ రమణా, అనధికార లేఔట్స్ విషయమై రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చీరాల ఆర్డీవో టీ.చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు. వేటపాలెం మండలం తహశీల్దార్ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం చీరాల ఆర్డీవో అధ్యక్షతన వేటపాలెం మండల తహశీల్దారు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించి రెవెన్యూ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో తీసుకోవాల్సిన చట్ట పరమైన చర్యలు గురించి పలు సూచనలు చేశారు.

అనధికార లేఔట్ల విషయంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుటకు ప్రభుత్వానికి చలాన చెల్లించి తగిన ధ్రువపత్రాలు పొందేట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు, పి జి ఆర్ ఎస్ ఆర్జీలు, సచివాలయ, మీ సేవ సర్టిఫికేట్ల విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. ఈసమావేశంలో తహశీల్దారు, పి.పార్వతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే జి.వి.ముసలయ్య, డిప్యూటీ తహశీల్దార్ డి.శ్రీకాంత్, విలేజ్ రెవెన్యూ అధికారులు, విలేజ్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story