- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bandi Sanjay: బీఆర్ఎస్ లో కేసీఆర్ ఏమైనా ఎక్స్ ట్రా ప్లేయరా? బండి సంజయ్ సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్ల పాటు కేసీఆర్ టైమ్ పాస్ రాజకీయాలు చేశారని ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని, మీడియాలో ఒకరిద్దరు నాయకులు తప్పా ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 'సమయం వచ్చినప్పుడు రావడానికి బీఆర్ఎస్ (BRS) లో కేసీఆర్ ఏమైనా ఎక్స్ ట్రా ప్లేయరా? అది నోరా మోరా? అలా అనడానికి కొంచమైనా సిగ్గుండాలి. ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకోవడానకి ప్రజలు మీకు ఓట్లు వేశారా? ప్రతిపక్ష నేత హోదా ఎందుకు తీసుకున్నారు? జీతం ఎందుకు తీసుకుంటున్నారు?. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా చేసి ఆయన చనిపోతే సంతాపం తెలుపని మూర్ఖుడు కేసీఆర్. కేసీఆర్ (KCR) అంటేనే విశ్వాసఘాతకుడు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించవు, మహనీయుల జయంతిలు, వర్ధంతులకు రాకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటే నువ్వేం ప్రతిపక్ష నాయకుడివి? నువ్వెల ప్రజా ప్రతినిధివి అవుతావు?' అని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా నీ కుటుంబ సభ్యులకే ఇవ్వాలనుకుంటే హరీశ్ రావుకు ఇవ్వాలన్నారు. పదవులన్నీ నీకే కావాలి కానీ ఫామ్ హౌస్ ను వీడవా అని మండిపడ్డారు. కేసీఆర్ యాస, భాషతో ఒకప్పుడు నడిచింది. ఇంకా అదే నడువదన్నారు. కేసీఆర్ రాచరిక కుటుంబ పాలన మళ్లీ రాదని ఆ విషయం మర్చిపోవాలన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ దేశ రాజకీయాలనేం చేస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ సంగతి చూస్తాని కేసీఆర్ అంటే ప్రజలు ఆయన సంగతి చూశారని సెటైర్ వేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ కేస్ అన్నారు. కేసీఆర్ ను ప్రజలు మర్చిపోయారన్నారు.
ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామా:
ఏడాది నుంచి రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మరో నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పేరుతో కొత్త డ్రామా ఆడుతోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే రూ. 15 వేలు రైతుభరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 12 వేలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. రైతులకు చెందిన ఒక్కో ఎకారనికి ప్రభుత్వం రూ. 18 వేు బాకీ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాదిలో రూ. 70 వేల కోట్ల అప్పు చెసింది. ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నదని ఆరోపించారు. టీఎస్ఐఐసీ దగ్గర భూములు తాకట్టు పెట్టి రైతు భరోసా కోసం రూ.10 వేల కోట్లు అప్పు తెస్తున్నారన్నారు.
ఇదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్దామా?
స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) ఎప్పుడు వచ్చినా కిషన్ రెడ్డి (Kishan Reddy) నేతృత్వంలో సత్తా చాటేందుకు బీజేపీ (BJP) సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది కాలంలో గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులపై కాంగ్రెస్ (Congress) పార్టీ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పథకాల వారీగా ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో మేము విడుదల చేయడానికి సిద్ధం అన్నారు. ఇదే ఎన్నికల ఎజెండాగా వెళ్దామా దీనిని మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ గెలిచినట్లుగానే అధికారంలో ఉంటే స్థానిక సంస్థలన్నింటిలో మేము గెలుస్తామనే గుడ్డినమ్మకంలో కాంగ్రెస్ ఉందని కానీ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులే కారణం అని వాస్తవాలు ప్రజలకు, మాజీ సర్పంచ్ లకు తెలుసన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న నరేంద్ర మోడీ పార్టీకే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ ఏం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని సికింద్రాబాద్, నాంపల్లి, రైల్వేస్టేషన్ల రూపురేఖలు మార్చేశాం. 5 వందే భారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చామన్నారు. రేపు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. ఆరు గ్యారంటీల అంశాన్ని కాంగ్రెస్ దారి మళ్లిస్తోందని దుయ్యబట్టారు.