- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Alcohol effect : ఆల్కహాల్‌తో అనర్థాలు.. డయాబెటిస్ బాధితులకు మరింత రిస్క్!
దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం తెలిసిందే. అయితే డయాబెటిస్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఫుడ్స్, కొన్ని రకాల షుగరింగ్ పానీయాలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీనివల్ల కలిగే అనర్థాలేవో చూద్దాం.
*డయాబెటిస్ పేషెంట్లు తరచుగా ఆల్కహాల్ తీసుకుంటే షుగర్ సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే రక్తంలో చక్కెరస్థాయిలు హెచ్చు తగ్గులకు గురవుతాయని, కొన్నిసార్లు అమాంతం పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడంవల్ల హైపోగ్లైసీమియా పెరిగే చాన్స్ ఉంటుంది.
*ప్రతిరోజూ మద్యం తాగే అలవాటు షుగర్ పేషెంట్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాపై ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ కణాల ఉత్పత్తికి నష్టం చేస్తుంది. షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణం అవుతుంది. పైగా ఆల్కహాల్‌లోని ‘మత్తు’ నరాలపై ప్రభావం చూపడం కారణంగా డయాబెటిస్ పేషెంట్లలో నరాల బలహీనత, పక్షవాతం వంటివి పెరగొచ్చు.
* కేలరీలు ఎక్కువగా ఉండటంవల్ల ఆల్కహాల్ చేవించే వారు బరువు పెరుగుతారు. డయాబెటిస్ పేషెంట్లకు ఇది మరింత రిస్క్. పైగా ఇన్సులిన్ నిరోధకతను నాశనం చేస్తుంది. అధిక రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. రోగ నిరోధక శక్తిని తగ్గించడం ద్వారా ఇన్ ఫెక్షన్లు పెరగానికి దోహదం చేస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. మరో విషయం ఏంటంటే.. డయాబెటిస్ బాధితులు ఆల్కహాల్ తీసుకోవాలా లేదా అనేది వారి షుగర్ లెవెల్స్‌పై ఆధారపడి కూడా ఉంటుంది. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.