పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

by Naveena |
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : హిందూ ముస్లింలు పవిత్రంగా జరుపుకునే పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 23,24,25 తేదీలలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బందిని 24 గంటల పాటు విధుల్లో ఉంచాలని సూచించారు. మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్గా ఏర్పాట్లకు 65 లక్షల రూపాయలను మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రోడ్డు మరమ్మత్తులు చేయాలని పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ కోటిరెడ్డికి కు కలెక్టర్ ఆదేశించారు. దర్గా వద్ద ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలన్నారు. వీలైన చోట మొబైల్ టాయిలెట్స్ ను మహిళల కొరకు ప్రత్యేకంగా ఉంచాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వ్యాపారులకు గృహ అవసరాలకు ఉత్సవానికి ప్రత్యేకంగా రిసిబిషన్ లైన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ కు ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేయాలన్నారు. పంచాయతీరాజ్ అధికారులు దర్గా చుట్టు రోడ్లను గ్రామంలో ఉన్న రోడ్లను మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. విఐపి లకు ప్రత్యేక ప్రోటోకాల్ అధికారిని నియమించాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అల్లరి మూకలను కట్టడి చేయాలని సూచించారు. తెలిపిన అన్ని అంచనాలను నివేదికలను రేపటిలోగా అధికారులంతా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు దర్గా ప్రాంతంలో పరిశీలించి పలు సూచనలు సలహాలు అందించారు. దర్గా ముజావర్ సయ్యద్ జానీ కలెక్టర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలను అందించారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు డిఎల్పిఓ యాదయ్య, పంచాయతీరాజ్ డిఈ కోటిరెడ్డి పంచాయతీ రాజ్ ఏఈ ప్రదీప్ , ఎలక్ట్రికల్ ఏడిఏ సక్రు నాయక్, తాహశీల్దార్ కమలాకర్ ఎంపీడీవో లక్ష్మి ఎస్సై లక్ష్మీ నరసయ్య ప్రజా ప్రతినిధులు మోతిలాల్, గోపాల్, సుబ్బారావు, నరసింహారావు. వెంకట్, డెక్కన్ సిమెంట్ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు, పెన్నా సిమెంట్స్ మేనేజర్ ప్రకాష్, ఎంపీఓ వీరయ్య పంచాయతీ సెక్రెటరీ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story