యాసంగి సాగులో చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : మెదక్ ఎమ్మెల్యే

by Kalyani |
యాసంగి సాగులో చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : మెదక్ ఎమ్మెల్యే
X

దిశ, మెదక్ ప్రతినిధి : యాసంగి 2024-25 పంటలకు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా చివరి వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇరిగేషన్, వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ… రబీ-2024-25 యాసంగి పంటలకు గాను జిల్లాలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు సింగూరు ద్వారా సాగునీరు అందించడంలో భాగంగా గన్ పూర్ ఆయకట్టు 21,625 హెక్టార్స్ సాగవుతుందని, విడతల వారీగా సాగునీరు అందించడంలో సింగూర్ వారికి అనుమతి కోసం లెటర్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు. 16 జనవరి రోజునుండి మొదటి విడతగా సాగునీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు.

జనవరి నుంచి ఏప్రిల్ మాసం వరకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లే విధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు క్రింద 10 చెరువులకు 500 ఎకరాల ఆయా కట్టుకు సాగునీరు అందుతుందన్నారు. మొత్తం రబీలో 28335 ఆయా కట్టు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… యాసంగి రైతులు సన్నధాన్యం పండించే విధంగా ప్రాధాన్యత కల్పించాలని సాగునీరు అందించడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ ఆర్ శ్రీనివాసరావు, డిఇ శివ నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి బద్రీనాథ్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story