ప్రభాస్ సరసన 'మాస్టర్' బ్యూటీ.. ఆ సినిమాలోనే..??

by Javid Pasha |   ( Updated:2022-03-06 19:21:25.0  )
ప్రభాస్ సరసన మాస్టర్ బ్యూటీ.. ఆ సినిమాలోనే..??
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానుల ఎదురుచూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వారికి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి నెట్టింట తెగ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో మారుతి దర్శకంలో తెరకెక్కించనున్న 'రాజా డీలక్స్' ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలియక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ సినిమాలో అవకాశం కోసం మెహ్రిన్ కూడా ప్రయత్నాలు చేసిందని టాక్ నడిచింది. తాజాగా ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి సినీ సర్కిల్స్‌ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 'రాజా డీలక్స్' సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ 'మాస్టర్' మూవీ బ్యూటీ మాలవిక మోహన్‌ను సంప్రదించారట. కానీ అమ్మడు ఏ విషయం చెప్పలేదట. ఇప్పటికి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనేమీ రాలేదు. మరి త్వరలో దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


Advertisement

Next Story