- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవచ్‌తో ప్రమాదాలకు బ్రేక్: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
దిశ, వికారాబాద్: రైల్వే ప్రయాణం ఇక మరింత భద్రం కానుంది. రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే కూడా చేరింది. అందులో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా, నవాబ్ పేట మండలం, గొల్లగూడ, చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్యలో పుల్ మామిడి గ్రామానికి సమీపంలో ఒకే రైల్వే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొనకుండా స్వదేశీ ప్రపంచ స్థాయి సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ "కవచ్" పనితీరును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరుండి పరీక్షించారు. ముందుగా ఒక రైల్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో రైల్లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠి ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు గొల్లగూడ - చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల నుండి ఒకే ట్రాక్ పై ఎదురుదెరుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఈ రెండు రైళ్ల మధ్య 380 మీటర్ల దూరం ఉన్నప్పుడు కవచ్ దీన్ని గుర్తించింది. వెంటనే ఆటోమెటిక్ బ్రేకులు పడి రైళ్లు ఆగిపోయాయి. ఇక వంతెనలు, మలుపులు ఉన్నచోట కవచ్ రైలు వేగాన్ని 30 కిలోమీటర్లకు మించకుండా ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని పనులను రైల్వే శాఖ మంత్రి దగ్గరుండి పరిశీలన చేసి కవచ్ గురించి రైలు నడుపుతున్న పైలెట్ ను అడిగి తెలుసుకుని అనంతరం దానిని రూపొందించిన ఇంజనీర్లు కూడా కవచ్ పనితీరు ఏ విధంగా ఉంది.. ఏ విధంగా పని చేసిందనే దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి మాట్లాడుతూ రెడ్ (డేంజర్) సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే, ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిక్ గా బ్రేకులు పడతాయి. పట్టాలు సరిగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు గుర్తించి ఇది నిలిపివేస్తదని తెలిపారు. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే, కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుందని చెప్పారు. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుందన్నారు. రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత 'కవచ్' పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారని చెప్పారు. ఈ సాంకేతికతతో 10వేల ఏళ్లలో ఒక తప్పిదం మాత్రమే జరిగే అవకాశముందని పేర్కొన్నారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కేంద్ర మంత్రిని కలిసి చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి రైల్వేస్టేషన్ స్టేషన్ లో వివిధ సమస్యల గురించి శంకర్ పల్లి స్టేషన్ మీదుగా వెళ్లే పలు ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను నిలుపుటకు వినతి పత్రం రైల్వే మంత్రికి అందించారు. అనంతరం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ నియోజకవర్గంలోని రైల్వేకి సంబంధించిన వివిధ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రికి వినతిపత్రం అందించడం జరిగింది.