అందరిముందే చీప్‌గా బిహేవ్ చేశాడు.. హీరోపై నటి ఫైర్

by sudharani |
అందరిముందే చీప్‌గా బిహేవ్ చేశాడు.. హీరోపై నటి ఫైర్
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవల ఓ భయంకరమైన అనుభవం ఎదురైనట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటిరోజే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఎమోషనల్ అయింది. అయితే సినిమా పేరు వెల్లడించని నటి.. షూటింగ్‌ ప్రారంభించిన మొదటి రోజే స్టార్‌ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. 'నేను అనారోగ్యంగా ఉన్న సీన్‌ను బెడ్ మీద పడుకోబెట్టి షూట్ చేయాలనుకున్నారు. దీంతో రిహార్సల్స్ మొదలుపెట్టాం. అక్కడ చాలామంది ఉనప్పటికీ అందరిముందే నా పాదాలను గిల్లాడు. అంతటితో ఆగకుండా కాళ్లపై ఎక్కడపడితే అక్కడే చేతులు వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే కోపంతో గట్టిగా అరిచాను. నాతో ఇలా ప్రవర్తించకూడదంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్‌ అయిన హీరో కాసేపు దూరంగా వెళ్లిపోయాడు' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story