- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2: జానీ మాస్టర్‌ను మళ్లీ తీసుకుంటారా.. విలేకర్ ప్రశ్నకు నిర్మాత షాకింగ్ కామెంట్
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ‘పుష్ప ది రైజ్’ బ్లాకబస్టర్ (blockbuster) హిట్ సాధించడంతో.. దీనికి సీక్వెల్ (sequel)గా వస్తున్న ‘పుష్ప-2’పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా (Pan India) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్-6 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు.
అయితే.. తాజాగా ఈ రిలీజ్ డేట్‌ను చేంజ్ చేస్తూ.. ఒక రోజు ముందుగానే పుష్ప రాజ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ (press meet) ఏర్పాటు చేసి.. ‘పుష్ప -2’ డిసెంబర్-5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు (producers) మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా ఓ విలేకరి.. ‘జానీ మాస్టర్ (Johnny Master) కి బెయిల్ వచ్చింది కదా.. ఆయనను మళ్లీ ‘పుష్ప-2’ సాంగ్ కంపోజ్ (Song Compose) చెయ్యడానికి తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నిర్మాత.. ‘ఆల్రెడీ కొరియోగ్రాఫర్‌ను మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్‌తో సాంగ్ షూట్ చేయించే పనిలో ఉన్నాము.. ఆ ఐటెం సాంగ్ నవంబర్ (November) 4 నుంచి షూట్ చేయబోతున్నాము. ఇక హీరోయిన్‌కు సంబంధించిన వివరాలు మరో రెండు రోజుల్లో తెలియజేస్తాము’ అని చెప్పుకొచ్చారు. కాగా ‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్ కొరియోగ్రాఫర్‌గా మొదటి జానీ మాస్టర్‌ను తీసుకున్నారు. అయితే.. ఓ లేడి కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలతో ఇటీవల జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.