- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవి సెలవులలోనే ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలి: నిమ్మల
దిశ, సూర్యా పేట: ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేక, విద్యార్థులకు సరైన బోధన చేయడానికి సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వచ్చే వేసవి సెలవులలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని, అదేవిధంగా ఈ సంవత్సరం మే నెలలో నిర్వహించాలనుకుంటున్న పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ని మార్చాలన్నారు. మార్చి నెల నుండి తీవ్రమైన ఎండలు ఉన్నందున పదవ తరగతి పరీక్షలను మే లో నిర్వహించడం సరైన నిర్ణయం కాదని ముందుగానే ఏప్రిల్ నెలలోనే నిర్వహించాలన్నారు. తీవ్రమైన ఎండలు ఉండే మే నెలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉన్నదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ని మార్చాలని ఆయన కోరారు.