- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రైన్‌లో గుర్రం ప్రయాణం.. నెట్టింట చూసి షాకైన రైల్వే అధికారులు!
దిశ, వెబ్‌డెస్క్ః ప్రభుత్వం పౌరల కోసమే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెట్టింది కానీ పశువుల కోసం కాదని అందరికీ తెలియాలిగా..?! రెక్కాడితేగాని డొక్కాడని జనాలకు దానిపైన అంత అవగాహన ఎక్కడుంటుంది. అందుకే, తమ కడుపునింపే పశువును ప్రయివేటు ట్రావెల్స్‌లో తీసుకెళ్లే స్తోమత లేక పబ్లిక్ ట్రాన్స్‌పోర్డు ఎక్కించారు. గొర్రె పిల్లో, పెంపుడు కుక్కో అయితే ఓకే గానీ ఏకంగా గుర్రాన్నే రైలెక్కిచ్చారు కొందరు వ్యక్తులు. పశ్చిమ బెంగాల్ లోకల్ ట్రైన్‌లో జరిగింది ఈ సంఘటన. సరికదా.. గుర్రం ప్రయాణిస్తున్న ఫోటో కాస్తా సోషల్ మీడియాకెక్కి వైరల్‌గా మారింది. ఫోటో అయితే నెట్టింట్లో వైరల్ అయ్యింది గానీ ఇంతకీ అది ఎప్పుడు జరిగింది, రైల్వే సిబ్బంది ఎలా అనుమతించారు అనే విషయంపై ఆరా లేదు.
సీల్దా-డైమండ్ హార్బర్‌లో లోకల్ ట్రైన్‌లో జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుకున్నారు. దక్షిణ 24 పరగణాస్‌లోని బరీపూర్‌లో ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ నుండి గుర్రం తిరిగి వస్తున్నట్లు సమాచారం తెలిసింది. మనుషులకే ఖాళీ లేక ఇరుక్కుంటున్న జాగాలో పెద్ద గుర్రాన్ని తీసుకొచ్చినందుకు తోటి ప్రయాణీకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయగా, ఈ విషయం తూర్పు రైల్వే ప్రతినిధి వరకూ చేరింది. ఈ వైరల్ ఫోటో గురించి తెలుసుకున్న అధికారులు విచారణ కోసం ఆదేశించారు.