- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో అవి అమ్ముకుంటున్న ప్రియాంకా చోప్రా.. అదే కారణమంట..?! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః ప్రియాంక చోప్రా భారతీయ సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి, హాలీవుడ్లో కూడా తన మార్క్‌ను చూపించుకుంది. పుట్టినిల్లు ఇండియాతో పాటు మెట్టినిల్లు అమెరికాను కూడా ఓన్ చేసేస్కుని బిజినెస్ ప్రారంభించింది. ఆమధ్య న్యూయార్క్ నగరంలో తన స్వంత ఇండియన్ రెస్టారెంట్ సోనాను ప్రారంభించిన కొన్నాళ్లకు, ఇప్పుడు సోనా హోమ్ అనే కొత్త హోమ్‌వేర్ లైన్ వెంచర్లోకి అడుగుపెట్టింది. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బుధవారం తన అభిమానులకు ఈ శుభవార్తను తెలియజేసింది. కొత్త బిజినెస్ లాంచ్ డే గురించి రాస్తూ, దీనికి సంబంధించి తాను ఎంత సంతోషంగా ఉందో తెలియజేసింది.
ఇందులో భాగంగా ఇంకా, ఆమె తన భారతీయ వారసత్వ సంస్కృతిని యునైటెడ్ స్టేట్స్‌లోని గృహాల్లో ఎలా అలంకరించబోతుందో వివరించింది. ఈ వస్తువులు అమ్మడం బిజినెస్ మాత్రమే కాదు, భారతీయతను వ్యాపింపజేయడంలో నా కర్తవ్యాన్ని పోషిస్తున్నట్లని వ్యాఖ్యానించింది. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లి గాయకుడు-నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత USలో తాను స్వయం శక్తితో రెండవ ఇంటిని నిర్మించుకోవడం ఎంత సవాలుగా మారిందో కూడా తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియోలో సహ వ్యవస్థాపకుడు మనీష్ గోయల్‌తో తన హోమ్‌వేర్ లైన్ నుండి కొన్ని వస్తువులను ప్రదర్శించింది.