బట్టలు దొంగతనం చేసిన స్టార్ హీరోయిన్.. కనిపెట్టేసరికి..

by sudharani |
బట్టలు దొంగతనం చేసిన స్టార్ హీరోయిన్.. కనిపెట్టేసరికి..
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. భర్త నిక్ జోనస్‌తో పాటు ఆరు నెలల తన బేబీతో లైఫ్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ సిరీస్ 'సిటాడెల్' కోసం డిఫరెంట్ లొకేషన్స్‌లో జరుగుతున్న షూటింగ్స్‌లో పాల్గొంటున్న ప్రియాంక.. భర్త జాకెట్స్ వేసుకున్నట్లు గుర్తించారు అభిమానులు. దీనిపై స్పందించిన ప్రియాంక.. నిజమేనని తెలిపింది. నిక్ జోనస్ జాకెట్స్, సెట్స్, సన్ గ్లాసెస్ చోరీ చేస్తానని చెప్పింది. తన దగ్గర కలెక్షన్‌కు ఫిదా అయిపోయానని, అందుకని అవే ధరిస్తానని చెప్పిన బ్యూటీ.. నిక్ షూ సైజ్ తనకు సెట్ కాదు కాబట్టి వాటిని దొంగిలించకుండా ఊరుకున్నానని వివరించింది. లేదంటే వాటిని కూడా విడిచిపెట్టేదాన్ని కాదని చెప్పుకొచ్చింది ప్రియాంక.

Advertisement

Next Story