నేషనల్‌ జుడిషియల్‌ కమిషన్‌ను పునరుద్ధరించాలి: ఎంపీ విజయసాయి

by Vinod kumar |
నేషనల్‌ జుడిషియల్‌ కమిషన్‌ను పునరుద్ధరించాలి: ఎంపీ విజయసాయి
X

దిశ, ఏపీ బ్యూరో: నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ను పునరుద్ధరించేందుకు వీలుగ రాజ్యాంగ సవరణను చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. నేషనల్‌ జడిషియల్‌ అపాయింట్మెంట్స్ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2015లో సుప్రీం కోర్టు కొట్టివేసింది.


ఈ తీర్పును పరిగణలోకి తీసుకుని ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పోస్టింగ్‌లపై తుదినిర్ణయం తీసుకునేందుకు ఎన్‌జేఏసీని పునరుద్ధరించడం ఈ బిల్లు లక్ష్యంగా ఆయన అభివర్ణించారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124, 217, 222ను సవరించాలని ప్రతిపాదిస్తూ ఆయన ఈ బిల్లును ప్రవేశ పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed