3వ తరగతి విద్యార్థినిపై 71 ఏళ్ల పాఠశాల ప్రిన్సిపాల్ అత్యాచారం

by Mahesh |
3వ తరగతి విద్యార్థినిపై 71 ఏళ్ల పాఠశాల ప్రిన్సిపాల్ అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: మనుమరాలి వయసున్న చిన్నారిపై 71 ఏళ్ల ప్రిన్సిపాల్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే. ముజఫర్ నగర్ జిల్లాలో ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 71 ఏళ్ల ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు. దీని గురించి ఆ విద్యార్థి రక్తస్రావంతో ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్‌ని అలాగే అత్యాచారానికి సంబంధించిన వివరాలను దాచి పెట్టినందుకు ప్రయత్నించిన మరో ఉపాధ్యాయుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (రేప్) , లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) కింద కేసు నమోదు చేశారు. అలాగే బాలికను వైద్య పరీక్షల కోసం పంపినట్లు సమాచారం. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కుమార్తెను ఏదో ఒక సాకుతో ప్రిన్సిపాల్ గదికి పిలిచారు. ఆ తర్వాత నా కూతురు బట్టలు విప్పి, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ప్రిన్సిపాల్, టీచర్ ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచి జైలుకు పంపినట్లు పోలీసు అధికారి ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు.

Advertisement

Next Story