మోడీ హెల్త్ కండిషన్ బాలేదా.? అసలు ఏం జరుగుతుంది..?

by Javid Pasha |
మోడీ హెల్త్ కండిషన్ బాలేదా.? అసలు ఏం జరుగుతుంది..?
X

దిశ, సినిమా : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ నేతల తీరుపై విభిన్నంగా స్పందించాడు. 'ప్రధాని మోడీ రోజుకు 22 గంటలు వర్క్ చేస్తూ కేవలం 2గంటలు మాత్రమే పడుకుంటున్నారు. ఆయన దీనిపై ఎక్స్‌పరిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన నిద్రపోవాల్సిన అవసరం లేదు' అని స్టేట్మెంట్ ఇచ్చారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్. కాగా దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. 'కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి.. నిద్ర లేకపోవడం అనేది 'ఇన్సోమ్నియా' అనే మెడికల్ కండిషన్.. దీనికి చికిత్స చేయాలి కానీ గొప్పగా చెప్పుకోకూడదు.. దయచేసి మీ నాయకుడిని జాగ్రత్తగా చూసుకోండి' అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈ విషయంపై నెటిజన్ల కామెంట్స్ మరో లెవల్‌లో ఉన్నాయి. 'నిద్ర సరిగ్గా లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. సంఘటనలను తప్పుగా గుర్తుంచుకుంటుంది. జాగ్రత్త సుమీ' అంటున్నారు.

Advertisement

Next Story