ప్రగతినగర్ కరూర్ వైశ్యా బ్యాంక్‌లో మంటలు!

by Vinod kumar |
ప్రగతినగర్ కరూర్ వైశ్యా బ్యాంక్‌లో మంటలు!
X

దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో కరూర్ వైశ్యా బ్యాంక్‌లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత సిబ్బంది బ్యాంక్‌కు తాళాలు వేసి వెళ్లిన అనంతరం రాత్రి 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు రావడం గమనించిన స్థానికులు, వాహనదారులు ఫైర్ సిబ్బందికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం అధికారులు, పోలీసులు శ్రమించి బ్యాంక్‌లోని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాంకు లోని ఫర్నిచర్, క్యాష్ కౌంటర్ దగ్ధం అయినట్లు సమాచారం. బ్యాంక్‌లో గల లాకర్లకు మంటలు వ్యాపించకపోవడంతో బ్యాంకు అధికారులు, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంక్‌లో మంటలు రావడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తేలాల్సి ఉంది. ఫైర్ సంఘటన పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story