Prabhas: ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ లుక్ వైరల్.. ఆనందంలో ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2024-10-21 09:00:09.0  )
Prabhas: ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ లుక్ వైరల్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి. రొమాంటిక్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఇప్పుడు అభిమానులను మరింత ఎగ్జైట్ చేసే విధంగా ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ న్యూ లుక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయితే.. తాజాగా డైరెక్టర్ మారుతీ (Maruti) పుట్టినరోజు (birthday) కావడంతో.. సినిమా సెట్స్ నుంచి షూటింగ్‌కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో (Making video)ను విడుదల చేశారు మేకర్స్. ఎంతో ఎగ్జైటింగ్‌గా సాగిన ఈ వీడియో లాస్ట్‌లో ప్రభాస్ మారుతి భుజంపై చేయి వేసి నిలబడి ఉన్నాడు. దానికి సంబంధించిన స్టిల్‌ను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story