Prabhas: బిగ్ అప్‌డేట్ : ప్రభాస్ త్రిఫుల్ ధమాకా.. ఒకేసారి మూడు బాహుబలి సినిమాలకు సైన్.. హోంబలే ఫిలిమ్స్ ట్వీట్ వైరల్

by sudharani |
Prabhas: బిగ్ అప్‌డేట్ : ప్రభాస్ త్రిఫుల్ ధమాకా.. ఒకేసారి మూడు బాహుబలి సినిమాలకు సైన్.. హోంబలే ఫిలిమ్స్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రజెంట్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘కల్కి’తో బ్లాక్ బస్టర్ (blockbuster) హిట్ అందుకున్న ఈయన.. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ‘రాజాసాబ్ (Rajasab), స్పిరిట్ (spirit), ఫౌజీ (Fauji)’ వంటి ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. అంతే కాకుండా ప్రభాస్ నటించిన సినిమాల నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంటోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ సినిమాలపై తాజాగా మరో బిగ్ అప్‌డేట్ (big update) వచ్చింది. ఇప్పటి వరకు నటిస్తున్న మూవీస్ కాకుండా మరో మూడు చిత్రాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలను హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) తెరకెక్కిస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చింది.

ఈ మేరకు.. ‘ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్’ అని ప్రకటిస్తూ.. ‘భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో మూడు చిత్రాల భాగస్వామ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం మాకు గర్వకారణం. మరచిపోలేని సినిమాటిక్ అనుభూతిని సృష్టించాలనే మా నిబద్ధతకు ఇది ఒక ప్రకటన. స్టేజ్ సెట్ చేయబడింది. ముందుకు సాగే మార్గం అపరిమితంగా ఉంటుంది. #Salaar2తో ప్రయాణం ప్రారంభమవుతుంది.. రెడీగా ఉండండి’ అంటూ ఓ నోట్ షేర్ చేసింది హోంబలే ఫిలిమ్స్. అయితే.. ఈ మూడు ప్రాజెక్టులలో ఒకటి ‘సలార్-2’ అని తెలుస్తుండగా.. మరో రెండు ప్రాజెక్టులు ఏంటా అని ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరగడంతో పాటు.. ఇంత బిగ్ అప్‌డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story