Prabhas: జపాన్‌లో మూడు రోజుల ముందునుంచే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్..

by Prasanna |
Prabhas: జపాన్‌లో మూడు రోజుల ముందునుంచే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : మన తెలుగు సినిమాలకు ఇతర దేశాల్లో ఎలాంటి మార్కెట్ ఉంటుందో మనకీ తెలిసిందే. ముఖ్యంగా, జపాన్ లో అయితే మన తెలుగు సినిమాలను బాగా చూస్తారు. అక్కడ కూడా మన టాలీవుడ్ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిలో ప్రభాస్ అయితే మరి చాలా మంది అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా ప్రభాస్ పుట్టినరోజును ఒక రేంజ్ లో జరుపుకుంటారు.

బాహుబలితో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రభాస్ బర్త్ డే ను జపాన్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ ఇప్పట్నుంచే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. మన తెలుగు రాష్ట్రాల్లో చేయడం కామన్, అయితే జపాన్ లో డార్లింగ్ బర్త్ డే ను చేయడం స్పెషల్ కదా..!

తాజాగా, రాధేశ్యామ్ మూవీని రీ రిలీజ్ చేసి ప్రభాస్ బర్త్ డే ని అడ్వాన్స్ గా జరుపుకున్నారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ పెద్ద బ్యానర్స్, ఫొటోలతో కొంచం సేపు సందడీ చేశారు. దీంతో, జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed