రాబోయే ఏళ్లలో భారత్‌లో జనసాంద్రత తగ్గబోతోంది..

by Nagaya |   ( Updated:2022-07-23 10:49:11.0  )
రాబోయే ఏళ్లలో భారత్‌లో జనసాంద్రత తగ్గబోతోంది..
X

న్యూఢిల్లీ: రాబోయే ఏళ్లలో ఐక్యరాజ్యసమితి భారత్‌లో జనాభా పెరుగుతోందని నివేదిక వెల్లడిస్తే, దీనికి బిన్నంగా స్టాన్ ఫోర్డ్ సర్వే కీలక విషయాలు చెప్పింది. 2100 కల్లా దేశ జనాభా 41 కోట్లు తగ్గుతుందని పేర్కొంది. అంతేకాకుండా జనసాంద్రత కూడా వేగంగా పడిపోతుందని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో రాబోయే 78 ఏళ్లలో 41 కోట్ల మేరకు జనాభా తగ్గుతుందని నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటరులో సగటున 476 మంది నివసిస్తుండగా, చైనాలో ఇది చదరపు కిలోమీటరుకు 148 మందిగా మంది. 2100 నాటికి, భారతదేశం యొక్క జనసాంద్రత ఒక కి.మీకి 335 వ్యక్తులకు తగ్గుతుందని అంచనా వేసింది. జన సాంద్రత తగ్గుదల మొత్తం ప్రపంచానికి అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణంగా చెప్పుకొచ్చింది. చైనాలో జనాభా ఏకంగా 90 కోట్లకు పైగా తగ్గి 49 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. యూఎస్ లోనూ జనాభా తగ్గుదల ఉంటుందని తెలిపింది. 'భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి ఒక పదునైన తగ్గుదల ధోరణి స్పష్టంగా కనిపించింది. దేశాలు ధనవంతులయ్యే కొద్దీ, సంతానోత్పత్తి రేట్లు స్థిరమైన జనాభాతో కాకుండా స్థిరమైన స్థాయిలకు తగ్గుముఖం పడతాయి' అని స్టాన్‌ఫోర్డ్ అధ్యయనం కనుగొన్నారు.

Advertisement

Next Story

Most Viewed