- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నిస్తే ఫైటింగ్ లే.!? సినిమా తరహాలోనే దాడులు
దిశ, నాగర్‌కర్నూల్: ప్రజాస్వామ్య దేశంలో పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ప్రశ్నించడం. ఎక్కడైనా ఏవైనా అవినీతి, అక్రమాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో ఓ ప్రజాప్రతినిధిపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించేందుకు వీలు కల్పించిన ప్రాథమిక హక్కులు. కానీ ప్రస్తుతం అవి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బంగపాటకు గురవుతున్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఎవరైనా సామాన్య జనం సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే త్వరలోనే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
మళ్లీ సీన్ రిపీట్ అయితే శాల్తీలు లేచిపోతాయ్ అంటూ హెచ్చరికలు వస్తున్నాయట. ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన దాడి జరుగుతుందో తెలియకుండానే ఒక సినిమా సెట్టింగుల మాదిరిగా దాడి జరిపేలా వ్యవస్థను సెట్ చేశారట. దీనికంతా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఓ ప్రజాప్రతినిధి తెరవెనుక నడిపిస్తున్నాడని ప్రస్తుతం కందనూల్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి ఆదివారం అర్ధరాత్రి జరిగిన సంఘటన బలపరుస్తోంది.
ప్రశ్నించిన వారిపై వరుస దాడులు
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ సమస్య పరిష్కారం అయ్యేవరకు సోషల్ మీడియా వేదికగా తన ఉద్యమాన్ని కొనసాగించే ఓ సామాజిక ఉద్యమకారుడికి గత ఏడాది చేదు అనుభవం ఎదురైంది. పోలీస్ స్టేషన్ వేదికగా బెదిరించి వ్యతిరేక పోస్టులు పెట్టొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు గతంలో పుకార్లు వినిపించాయి. గత రెండు నెలల క్రితం మరో వ్యక్తిని ప్రధాన రహదారిపైనే ఓ సినిమా ఫైటింగ్ మాధురి గొడవ సృష్టించి తిరిగి పోలీస్ స్టేషన్లో దేహశుద్ధి చేసినట్లు సదరు వ్యక్తి ఆరోపించాడు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇదే తరహాలో ఆదివారం రాత్రి బీజేపి కార్యకర్త విజయ్ ఇంటిపై కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపించాడు. తన కుటుంబం కూడా గాయాలు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు వ్యక్తిపై టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న దళిత నేతలంతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం విశేషం.
దళితులను చేరదీసేది ఇందుకేనా.?
దళితుల అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని చెప్పుకునే ప్రజా ప్రతినిధులు దళితులను, దళిత సంఘాలను చేరదీసి తన పదవీ రక్షణ కోసం ఉపయోగించుకుంటున్నారన్న వాదనలు ఇతర దళిత సంఘాల నేతల నుంచి వినిపిస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్న అంశాలపై ఇతర పార్టీ నేతలు, యువకులు, ప్రజా సంఘాలు, సామాన్యజనం ప్రశ్నిస్తే వారిపై ప్రతి విమర్శలు, ప్రతి దాడులు చేసేందుకు అమాయకులైన దళితులను వాడుకుంటున్నారన్న అపవాదును ప్రజా ప్రతినిధి మూటగట్టుకున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సైతం ఇసుక మాఫియాపై జడ్పీ సభ సాక్షిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి.
భయబ్రాంతులకు గురవుతున్న సామాన్య జనం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే తిరిగి సదరు ప్రజాప్రతినిధి లేదా అధికారులను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉన్నప్పటికీ వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రజలు ఎవరు వారి సమస్యల పట్ల చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదట. నియోజకవర్గంలో ఇప్పటికే నల్ల మట్టి దందా ఇసుక మాఫియా కల్తీ కల్లు మాఫియా భూకబ్జాలు చెరువు శిఖం భూములు కబ్జా వంటి అంశాలపై తరచూ అధికార పార్టీ నేతల పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వాటిపై పత్రికల్లో టీవీల్లో ప్రచారం జరిగినా వాటిని వెంటనే తిప్పికొట్టాలని సోషల్ మీడియా వారియర్స్కు ప్రజా ప్రతినిధులు ఆదేశాలు జారీ చేయడంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడులకు సాహసిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసి దాడులకు తెగబడుతున్న వారిపై, సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిదులపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేసి అనిల్ వరిస్తే ఈ పరిస్థితి అదుపులోకి రానుందన్న వాదన వినిపిస్తోంది.