యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. దాని ఆధారంగా గుర్తించి.. లేదంటే..!

by Satheesh |
యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. దాని ఆధారంగా గుర్తించి.. లేదంటే..!
X

దిశ, తిమ్మాపూర్: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డిప్లొమా విద్యార్థి ప్రాణాలను మానకొండూర్సీదిశ, తిమ్మాపూర్: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డిప్లొమా విద్యార్థి ప్రాణాలను మానకొండూర్ఐ కృష్ణారెడ్డి, ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి‌లు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్‌కు చెందిన అప్పాని విజ్ఞాన్ తిమ్మాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధాలు రావడంతో అలుగునూర్‌లోని కెనాల్ వద్దకు చేరుకుని తండ్రి తిరుపతాచారికి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వెంటనే తండ్రి హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ కృష్ణారెడ్డి‌కి సమాచారం అందించి సహాయం చేయాలని కోరారు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. సైబర్ సెల్ పోలీసులకు వివరాలు అందించారు. సైబర్ పోలీసులు ఇచ్చిన సాంకేతిక సమాచారాన్ని సీఐ వెంటనే ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ ప్రమోద్ రెడ్డికి తెలిపారు. వారు సిబ్బందితో హుటాహుటిన ఆ యువకుడు ఉన్న ప్రదేశానికి చేరుకుని నీళ్లలో దూకే ప్రయత్నం చేస్తున్న యువకుడిని కాపాడారు. అనంతరం ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed