దొంగకు బదులుగా ఆమె ఫొటో వాడిన పోలీసులు.. రూ.220 కోట్ల పరువునష్టం దావా వేసిన మహిళ

by Manoj |   ( Updated:2022-03-17 09:42:31.0  )
దొంగకు బదులుగా ఆమె ఫొటో వాడిన పోలీసులు..  రూ.220 కోట్ల పరువునష్టం దావా వేసిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇవా లోపేజ్.. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై రూ.220 కోట్ల పరువునష్టం దావా వేసింది. భారీ దోపిడీకి పాల్పడిన ఓ మహిళకు బదులుగా కన్‌ఫ్యూజన్‌లో లోపేజ్ ఫొటోను వాడిన పోలీసులు.. ఇంటర్నెట్, వాల్‌పేపర్స్‌పై ప్రకటనలు ఇచ్చారు. ఇదే సమయంలో ఫ్లోరిడా వెకేషన్‌కు వెళ్లిన లోపేజ్ ఫొటో విషయం తెలియడంతో వెంటనే పోలీసులను కాంటాక్ట్ చేసింది. రూమ్‌మేట్ నుంచి కాస్ట్‌లీ ఐటెమ్స్, డబ్బు దొంగతనం చేసిందనే కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న లేడీకి బదులుగా తన ఫొటో చేర్చారని ఇన్‌ఫార్మ్ చేయగానే.. రియలైజ్ అయిన పోలీసులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యాడ్స్‌లోనూ తన ఫొటోస్ రిమూవ్ చేశారు. ఈ ఘటన గతేడాది ఆగస్టులో జరిగినప్పటికీ ఇంకా నెట్టింట తిరుగుతూనే ఉందని.. ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాలో తనను ఒక దొంగగా, సెక్స్ వర్కర్‌గా చూస్తున్నారని బాధపడింది. అందుకే పోలీసులపై పరువు నష్టం దావా వేసినట్లు చెప్పింది. ఇక లోపేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 8.4 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది.

Advertisement

Next Story