- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నగరంలో ఖాకీల ద్వంద వైఖరి.. వీఐపీలకు నో రూల్స్..?
దిశ, ఖమ్మం టౌన్: సామాన్య ప్రజలను, అసామాన్యులను పోలీసులు వేరు చేసి చూస్తారనేది అనేక సందర్భాల్లో స్పష్టం అవుతూనే ఉంది. ఖాకీలు సామాన్య ప్రజలపై చూపే ప్రతాపం వీఐపీల వద్ద కానరాదు. ఖమ్మం పోలీసులు తరుచు చిన్న దానికి పెద్ద దానికి హడావుడి చేస్తారు. సామాన్య ప్రజలు రోడ్డు పక్కన బండి ఆపితే వెంటనే ఖాకీ కెమెరా క్లిక్ అంటుంది. మన సెల్ ఫోన్‌కు జరిమానా సందేశం వస్తుంది. నగర టీఆర్ఎస్ అధ్యక్షుడు నడి రోడ్డుపై తన ఇన్నోవా కారును అది కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై అడ్డంగా పార్కింగ్ చేసిన కాని ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. అక్కడే బస్సులు ఆగి ప్యాసింజర్లు కిందకు దిగే ప్రాంతం .. అక్కడ బస్సు ఆగితే వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోవాల్సిందే.
అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలో ముందస్తు సమాచారం ఉంటుంది ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. కానీ ఇలా అకస్మాత్తుగా అది కూడా సాధారణ నగర ప్రెసిడెంట్ నడి రోడ్డుపై కారు నిలిపి పోలీసులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో వారికే తెలియాలి. పోలీసులు ఇలా ద్వంద వైఖరితో వ్యవహరించడం సరైంది కాదు.. నాయకులు సైతం సామాన్యులకు ఆదర్శంగా ఉండటం అవసరమనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది.