- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చండి : చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
దిశ, గుమ్మడిదల : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ తర్వాతే విజయోత్సవ సంబరాలను నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం ప్రజా పాలన విజయవస్తవ సంబరాలను నిర్వహించుకోవడం పై స్పందిస్తూ గుమ్మడిదల మండల కేంద్రంలోని సీజీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత 6 గ్యారంటీలను హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సంవత్సర కాలం గడుస్తున్న నేటి వరకు ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు చేసిన అతికొద్ది హామీలు కూడా అసంతృప్తిగానే మిగిలిపోయాయని అన్నారు.
ముఖ్యంగా రైతు రుణమాఫీ రెండు లక్షల హామీ నేటి వరకు అమలు కాలేదని అన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం ఆడబిడ్డలకు 2500 పెన్షన్, వృద్ధులకు 4000 పెన్షన్, నిరుద్యోగులకు ఒక్క లక్ష ఉద్యోగాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ఏ హామీను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని విమర్శించారు. అయినప్పటికీ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను నిర్వహించుకోవడం ఈ ప్రభుత్వానికే సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ఆ తర్వాతే విజయోత్సవ సంబరాలను నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేంతవరకు ప్రజల పక్షాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.