Minister Vasamsetti Subhash:ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తా.. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు

by Jakkula Mamatha |
Minister Vasamsetti Subhash:ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తా.. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన పై మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamsetti Subhash) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, అవినీతిపరులపై తక్షణ చర్యలు ఉంటాయని, ప్రతి అంశాన్ని పరిశీలించి శాఖలో ప్రక్షాళన చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీ, బీమా వైద్య సేవల మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక, కర్మాగారాల, బాయిలర్లు మరియు కార్మిక బీమా వైద్య సేవల శాఖలలో ఏ అధికారి లేదా ఉద్యోగి పై ఎటువంటి ఫిర్యాదులైన నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఫిర్యాదుల పై సమగ్ర విచారణ జరిపించి, ఆరోపణలు ఋజువైనట్లతే, తక్షణమే వారి పై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.

అంతే కాకుండా గత ప్రభుత్వం అండ దండలతో కర్మాగారాల శాఖలో కొంత మంది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఫ్యాక్టరీల యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటి అనేక ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయన్నారు. అందువల్ల కర్మాగారాల శాఖ నుంచే నా ప్రక్షాళన ప్రక్రియ మొదలు పెట్టాను. అందులో భాగంగా కొందరు అధికారులను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు ట్రాన్స్ఫర్ చేయడం కొరకు ఫైల్ ప్రక్రియలో ఉంది అని తెలిపారు. త్వరలోనే వారిని బదిలీ చేయుటకు తగు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. మన ప్రభుత్వం(AP Government) యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story