Damodar Raja Narasimha: ఫార్మసిస్టులకు హెల్త్ మినిస్టర్ స్వీట్ వార్నింగ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-22 07:53:41.0  )
Damodar Raja Narasimha: ఫార్మసిస్టులకు హెల్త్ మినిస్టర్ స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Secretariat)లో సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై మంత్రి దామోదర్ రాజ నరసింహా(Damodar Raja Narasimha) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఫార్మసిస్టు(Pharmacists)లు బాధ్యతతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృతిమ మందుల కొరతపై చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులకు ఆదేశించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్ (CMS)లలో ఫార్మసీ సిబ్బంది, మౌళిక సదుపాయాల కల్పన, మందుల సరఫరాకు రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed