- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశ రాజధానికి పొంచి ఉన్న ఉగ్రముప్పు.. సెక్యూరిటీ అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో న్యూఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తెహ్రిక్ – ఇ – తాలిబన్ ఉగ్రవాద సంస్థ నుంచి కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో వీటిని పరిశీలించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ సందేశాలను ఢిల్లీ పోలీసులకు చేరవేశారు. ఆ ఈమేయిల్స్ ఆధారంగా ఢిల్లీలో ఉగ్రదాడి జరగనుందని నగరంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీని అలర్ట్ చేశారు పోలీసులు. అంతే కాకుండా సరోజిని నగర్ మార్కెట్ లో సోదాలు నిర్వహించారు. కొన్ని భద్రతపరమైన ముప్పు కారణంగా గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తున్నారు. మరోవైపు భద్రతాపరమైన ముప్పు కారణంగా మార్కెట్లను మూసివేస్తున్నట్లు సరోజినీ నగర్ మినీ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అలాగే ఈ మెయిల్స్ ఎలా వచ్చాయి.. వీటిని ఎవరు పంపారు అనే కోణంలో ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.