టీనేజర్స్‌లో వాంఛ.. నేరమా? యంగ్ పీపుల్ సెక్స్‌ను క్రిమినలైజ్ చేస్తున్న పోక్సో

by Javid Pasha |   ( Updated:2022-03-06 02:21:24.0  )
టీనేజర్స్‌లో వాంఛ.. నేరమా? యంగ్ పీపుల్ సెక్స్‌ను క్రిమినలైజ్ చేస్తున్న పోక్సో
X

దిశ, ఫీచర్స్ : పోక్సో చట్టం లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించబడింది. కానీ ఏకాభిప్రాయ శృంగార సంబంధాల్లో(Consensual romantic relationships) యువ జంటలకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతోంది. ఈ చట్టం ప్రకారం.. ఎవరైనా సరే మైనర్లతో లైంగిక చర్యకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు యువతీ యువకుల మధ్య అంగీకారంతో కూడిన సంబంధాలనైనా ఈ చట్టం ఉపేక్షించదు. ఇలా ఆచరణలో వినాశకర ప్రభావాలను కలిగి ఉన్నందున వేలాది జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. యువకులు హింసాత్మక నేరాలకు పాల్పడినట్లు తరచూ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. చివరకు యావజ్జీవ కారాగార శిక్షకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేరంగా పరిగణించబడుతున్న టీనేజ్ సెక్స్‌ నుంచి పిల్లలను ఎలా రక్షించాలి? అసలు వారి శరీరాలను నియంత్రించడం సాధ్యమేనా?

2018లో బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ఈ చట్టంలోని లొసుగులను ఆవిష్కరించింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక హైస్కూల్ విద్యార్థినికి సడెన్‌గా కడుపు నొప్పి రావడంతో తల్లి ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ కోసం వెయిట్ చేస్తుండగానే టాయిలెట్‌కు వెళ్లిన సదరు విద్యార్థి అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే గర్భవతినన్న విషయం అప్పటి వరకు తనకు తెలియదని ఆ స్టూడెంట్‌ చెప్పడం సింగిల్ పేరెంట్ అయిన తల్లిని షాక్‌కు గురిచేసింది. నిజానికి బాలికలో ఫిజికల్‌గా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు గానీ కొంచెం బరువు పెరిగింది. ఆమె శారీరక స్వభావం దృష్ట్యా మెన్‌స్ట్రువల్ సైకిల్‌కు కూడా అలవాటు పడలేదు. దీని తర్వాత క్లాస్‌మేట్‌‌తో ఒక రాత్రి కాన్‌సెన్సువల్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నట్లు తల్లికి చెప్పింది. దీంతో ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం డాక్టర్లు ఈ కేసు గురించి పోలీసులకు సమాచారమిచ్చారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 357(సి) ప్రకారం వైద్యులు వివిధ లైంగిక నేరాల గురించి పోలీసులకు రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి చేయబడింది. లేకుంటే వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేయొద్దని తల్లీకూతుళ్లు పోలీసులు, వైద్యులకు విన్నవించారు. కానీ మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న ఆ 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. అబ్జర్వేషన్ హోమ్‌కు పంపిన కొన్నిరోజులకు అతనికి బెయిల్ లభించింది. ఇక బాధితురాలైన బాలిక.. తరచూ సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులను కలవడంతో పాటు వైద్యులు, పోలీసులు, జడ్జిల చుట్టూ విచారణ పేరుతో లెక్కలేనన్ని రోజులు గడపాల్సి వచ్చింది. బాలుడితో తన సంబంధం గురించిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఆమె భావి జీవితానికి ప్రతిబంధకంగా మారాయి.


భారతదేశంలో 243 మిలియన్ పిల్లలు కౌమారదశలో ఉన్నారు. వీరిలో రిలేషన్‌షిప్‌లో ఉన్న వేలాది మందిపై పోక్సో చట్టాన్ని ప్రయోగించడం వల్ల వారి జీవితం చీకటిమయం అవుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020లో పోక్సో చట్టం కింద పిల్లలపై 28,327 నేరాలను నమోదు చేశారు. 99% కేసుల్లో బాలికలే బాధితులు కాగా.. వీరిలో 88% 12 నుంచి 18 ఏళ్ల వయసుగల వారేనని తేలింది. ఈ అమ్మాయిల్లో చాలా మంది వేధింపుల బారిన పడకపోవచ్చు. కానీ చట్టానికి బాధితులయ్యారనే కఠిన వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంది. కాగా POCSO కింద బుక్ చేసిన ఏకాభిప్రాయ సంబంధాలకు సంబంధించిన అధికారిక రికార్డులు లేవు.

2017లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం రొమాంటిక్ కేసులు 25% POCSO కేసులకు కారణమయ్యాయి. 'HAQ : సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ అండ్ ది ఫోరమ్ అగైనెస్ట్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ లేదా FACSE' అధ్యయనం.. నవంబర్ 2012 నుంచి జూలై 2015 వరకు ఢిల్లీ, ముంబైలోని ప్రత్యేక కోర్టుల్లో 1,957 కేసులను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది. అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లోనూ కాన్‌సెక్సువల్ రిలేషన్‌షిప్స్‌లో అడాలసెంట్స్‌కు వ్యతిరేకంగా విచక్షణారహితంగా ఉపయోగించబడిందని స్పష్టమైంది. ఇక 2014లో 'ది హిందు' నిర్వహించిన మరో విశ్లేషణలోనూ 40% పోక్సో కేసులు ఈ తరహాకు చెందినవేనని గుర్తించారు.

2012 నిర్భయ కేసు తర్వాత జువైనల్ జస్టిస్ యాక్ట్‌ను సవరించారు. ఈ మేరకు క్రూరమైన నేరాల్లో 16 నుంచి 18ఏళ్ల వ్యక్తులను క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కింద పెద్దలుగా విచారించడానికి అనుమతించబడింది. దీంతో కౌమారదశలో ఉన్న పురుషులకు ప్రమాదం పెరిగిందని బెంగళూరులోని వైదేహి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ నారాయణరెడ్డి వివరించారు. 'టీనేజ్ సెక్స్ నేరమని పిల్లలకు అవేర్‌నెస్ కల్పించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. 21వ శతాబ్దంలో యంగ్ పీపుల్ శరీరాలను నియంత్రించాలనుకుంటున్నారు. ఈ నైతిక వైఖరి ఎక్కడ నుంచి వచ్చింది?' అని బెంగళూరు ఎన్జీవో హెడ్ ఖుషీ కుశలప్ప ప్రశ్నించారు. 'క్రిమినల్ జస్టిస్‌ సిస్టమ్‌లోకి ప్రవేశించకుండా వారిని రక్షించాల్సిన అవసరముందని HAQ-FACSE అధ్యయన రచయితల్లో ఒకరైన ముంబై న్యాయవాది మహారుఖ్ అడెన్‌వాలా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed