రేపే యోగీ ప్రమాణస్వీకారం.. ప్రత్యేక అతిథులుగా 'ది కశ్మీరీ ఫైల్స్' చిత్ర బృందం

by Vinod kumar |
రేపే యోగీ ప్రమాణస్వీకారం.. ప్రత్యేక అతిథులుగా ది కశ్మీరీ ఫైల్స్ చిత్ర బృందం
X

లక్నో: యోగీ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. రెండో సారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా శుక్రవారం యోగీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా రానున్నారు. ఇక మరి ముఖ్యంగా ఈ మధ్యనే విడుదలై సంచలన విజయం సాధించిన ది కశ్మీరీ ఫైల్స్ మూవీ నటీనటులు కూడా హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


కాగా, లక్నోలోని అటల్ బీహారీ వాజ్‌పెయ్ ఎకానా క్రికెట్ స్టేడియం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. దాదాపు 20 వేల మందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక గోవా సీఎం గా ప్రమోద్ సావంత్ మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed