- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసియాలోనే అతిపెద్ద బయో-సీఎన్‌జీ ప్లాంట్ ప్రారంభించిన ప్రధాని మోడీ.......
న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్‌తో పాటు ప్రధాని వర్చువల్‌గా శనివారం ఇండోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లోని ఇళ్లు, జంతువులు, పొలాల నుండి విడుదలయ్యే తడి వ్యర్థాలకు బయో-సీఎన్‌జీ ప్లాంట్ చాలా ముఖ్యమని అన్నారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 75 ప్రధాన మున్సిపల్ ప్రాంతాల్లో 75 ప్లాంట్లను స్థాపించనున్నాం. దీంతో దేశంలోని నగరాలను పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా స్వచ్ఛ శక్తిని అందించేలా తీర్చిదిద్దనున్నామని చెప్పారు.
బయో సీఎన్‌జీ ప్లాంట్ నిర్మాణం 'వేస్ట్ టూ వెల్త్' అనే సూత్రం ప్రకారం పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నమని ప్రధాన మంత్రి అన్నారు. కాగా ఈ ప్లాంటు 550 టన్నుల తడి వ్యర్థాలతో 17వేల కేజీ సీఎన్ జీ తో పాటు 100 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.150 కోట్లు వెచ్చించారు. దీని ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్ లో 50 శాతం ప్రజా రవాణాకు, మిగతా గ్యాస్ పలు పరిశ్రమలకు అందుబాటులో ఉంచనున్నారు. 'స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద చెత్త రహిత నగరాలు సృష్టించాలనే ప్రధాని మోదీ ముందుచూపు అనుగుణంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్ ఉంది' అని పీఎంవో తెలిపింది.