పిస్తాపప్పులు-పాలు కాంబినేషన్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!!

by Anjali |
పిస్తాపప్పులు-పాలు కాంబినేషన్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!!
X

దిశ, వెబ్‌డెస్క్: పిస్తా పప్పులు(Pistachio nuts) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. పిస్తా గుండె ఆరోగ్యానికి ఎంతో సహయపడుతుంది. బరువును నియంత్రించడంలో మేలు చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. పిస్తాలో ప్రోటీన్(Protein ), విటమిన్లు(vitamins) మరియు విటమిన్ B6,ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇక పాల ప్రయోజనాలు చూసినట్లైతే..

పాల ప్రయోజనాలు..

పాలు సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగితే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. పాలలో శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్లు, కేలరీలు(Calories), సహజ కొవ్వు(Natural fat), విటమిన్ డి, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాగా పాలు తాగితే బిపీ కంట్రోల్ లో ఉంటుంది. బాడీని ఫిట్ గా ఉంచడమే కాకుండా ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. డయాబెటిస్ పెషేంట్ల(Diabetes patients)కు పాలు మంచి ఔషధంగా చెప్పుకుంటారు. కాగా ఇన్ని ప్రయోజనాలున్న పాలు పిస్తా పప్పులలో మరిగించి తాగితే మరిన్ని ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

పిస్తా- పాలు మరిగించి తాగితే బోన్స్(Bones) స్ట్రాంగ్ గా ఉంటాయి. పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంలో మేలు చేస్తాయి. ఈ పాలు కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మంచివి. చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed