- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో సంస్థను కొనుగోలు చేసిన ఫోన్‌పే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే సోమవారం ఫ్రీలాన్స్ సూక్ష్మ వ్యాపారవేత్తల నెట్‌వర్క్‌ను కలిగిన గిగ్ఇండియాను కొనుగోలు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. గిగ్ఇండియా మొత్తం 15 లక్షల మంది వ్యవస్థాపకులతో పాటు, 100 కంటే ఎక్కువ సంస్థలను వినియోగదారులుగా కలిగి ఉంది. తాజా ఒప్పందం నేపథ్యంలో వీరందరూ ఫోన్‌పే సంస్థలో భాగం కానున్నారు. అలాగే, గిగ్ఇండియాలో దాదాపు 100 మంది ఉద్యోగులు ఉండగా, వీరు కూడా ఫోన్‌పేలో చేరనున్నారు. ఈ కొనుగోలుకు సంబంధించి లావాదేవీ విలువను కంపెనీ వెల్లడించలేదు. ఈ కొనుగోలు ద్వారా ఫోన్‌పే తన ఆఫర్లను మరింత బలోపేతం చేయడం, దేశంలోని ఫ్రీలాన్స్ చిన్న వ్యాపారులకు అవకాశాలను సృష్టించేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది. ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఫ్రీలాన్స్ విభాగంలో ఉన్నవారు 2025 నాటికి దాదాపు రూ. 2.2 లక్షల కోట్ల మార్కెట్‌గా ఎదగనుంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పేతో కలవడం సంతోషంగా ఉంది. గిగ్ఇండియా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలకు కీలకమైన భాగస్వామిగా ఉంది. ఫోన్‌పేతో కలిసిన తర్వాత మరింత అభివృద్ధి ఉంటుందని ఆశిస్తున్నట్టు గిగ్ఇండియా సీఈఓ సాహిల్ శర్మ అన్నారు.