- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లీటర్ పెట్రోల్‌పై రూ.50, డీజిల్‌పై రూ.75 ధర పెంపు!
దిశ, డైనమిక్ బ్యూరో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇప్పటికే వంట నూనె ధరలు పెరిగి సామాన్యుడిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే, రష్యా నుంచి చాలా దేశాలు ముడి చమురును దిగుమతి చేసుకుంటాయి. యుద్ధం కారణంగా ముడిచమురు దిగుమతి తగ్గిపోయింది. దీంతో పెట్రో ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇదే ప్రభావం భారత్‌లోనూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం అలాంటి పరిస్థితి లేదంటూ చెప్పుకొస్తుంది.
అయితే, పొరుగుదేశమైన శ్రీలంకా ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా.. యుద్ధం కారణంగా మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముడి చమురు నిల్వలు తగ్గిపోవటంతో పాటు బ్యారెల్ ధరలు కూడా పెరిగాయి. అంతేకాకుండా, శ్రీలంక రూపాయి విలువ రూ.57 తగ్గడంతో ఆ దేశ ఆయిల్ కంపెనీ(ఎల్ఐఓసీ) భారీగా ఇంధన ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఏకంగా లీటర్ పెట్రోల్ పై రూ.50, లీటర్ డీజిల్ పై రూ.75 పెంచుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.254, లీటర్ డీజిల్ ధర రూ.214కు చేరింది. ఈ క్రమంలో ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ప్రజలకు ఉపశమనం కల్గించాలని లంక పౌరులు డిమాండ్ చేస్తున్నారు.