- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులకు షాక్.. 'డబుల్' ఇండ్లను స్వాధీనం చేసుకున్న ప్రజలు
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆదివారం గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, ఎంపీటీసీ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలు తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కుమార్, గడ్డమీది సురేష్, మర్రి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఐదేళ్లు అవుతున్నా కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో కట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వాటిని పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని, ఇల్లు రాని వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవర వెంకటేష్ ,ఉమా శంకర్ ,గడ్డం సాయిలు, కలకల రేణుక, లలిత, సుజాత పాల్గొన్నారు.