ఘనంగా ప్రారంభమైన ‘పెన్ డ్రైవ్’ మూవీ..సాయి కుమార్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
ఘనంగా ప్రారంభమైన ‘పెన్ డ్రైవ్’ మూవీ..సాయి కుమార్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ఎం ఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా ‘పెన్ డ్రైవ్’. శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై కటకం వెంకటేశ్వర్లు బ్యానర్‌పై కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ నివ్వగా.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత కె రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిన్ననే కథ వినడం జరిగింది, చాలా బాగుంది. నా పాత్ర కూడా చాలా బాగా రాశారు. పేరు కూడా నాకు చాలా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని డైరెక్టర్‌కు, హీరో హీరోయిన్‌లకు, నటించే మిగతా నటి నటులకు మంచి పేరు రావాలని, నిర్మాతకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Advertisement

Next Story