బంపర్ ఆఫర్.. ఉచితంగా 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా టికెట్!

by Harish |   ( Updated:2022-03-16 13:14:34.0  )
బంపర్ ఆఫర్.. ఉచితంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టికెట్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా టికెట్ల కోసం అభిమానులు ఇప్పటినుంచే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగైనా సినిమా ఫస్ట్ రోజే చూడాలని చాలా మంది ప్రేక్షకులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. బ్లాక్‌లో ఎంత ధరైన చెల్లించడానికి కొంత మంది సిద్దంగా ఉన్నారు.

ఇలాంటి టైంలో ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ పేటీఎమ్ కొత్త ఆఫర్‌ను తెచ్చింది. రూ.1కే 'ఆర్ఆర్ఆర్ 'మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్‌లో తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే ఉంటుంది. ఈ టికెట్‌ను పొందడానికి ప్రేక్షకులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి రూ.1 పంపిస్తే రూ.150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు. పేటీఎమ్ జెనీకి పంపిన రూ.1 ని కూడా తిరిగి ఖాతాలో రీఫండ్ చేయనున్నారు. ఈ ఆఫర్ వలన ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు.

Advertisement

Next Story