Patang: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పతంగ్’..

by sudharani |   ( Updated:2024-10-14 14:31:24.0  )
Patang: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పతంగ్’..
X

దిశ, సినిమా: ప‌తంగుల పోటీ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘ప‌తంగ్’(Patang). ప్రణీత్ ప్రత్తిపాటి (Praneeth Prattipati) ద‌ర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే (Vijay Sekhar Anne), సంప‌త్ మ‌క (Sampat Maka), సురేష్ కొత్తింటి (Suresh Kothinti) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రీతి ప‌గ‌డాల‌ (Preeti Pagadala), ప్రణ‌వ్ కౌశిక్ (Pranav Kaushik), వంశీ పూజిత్ (Vamsi Poojit) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్రముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.

డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. '‘పతంగ్’ థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా సరికొత్తగా ఉంటుంది. అలాగే మా సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. త‌ప్పకుండా మా ప‌తంగ్ (Patang) చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మకం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్ము్తున్నాము' అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed