మోడీని టీవీ డిబేట్‌కు ఆహ్వానించిన పాక్ ప్రధాని!

by Web Desk |
మోడీని టీవీ డిబేట్‌కు ఆహ్వానించిన పాక్ ప్రధాని!
X

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య విభేదాలు పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని టీవీ డిబేట్‌కు ఆహ్వానించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకో కలిగితే అది భారత ఉపఖండంలోని బిలియన్లకు పైగా ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

అయితే దీనిపై భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఇప్పటికీ స్పందించలేదు. మరోవైపు ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవని ఈ మధ్యకాలంలో భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోని ఉగ్రసంస్థలు, ఉగ్రవాదులను చేధించి శిక్షించాలని భారత్ కోరుతున్నది. అయితే రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి తమ ప్రాధాన్యమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed