పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కోహ్లీ ఆడాలంటున్న పాక్ ఫ్యాన్స్!

by Web Desk |
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కోహ్లీ ఆడాలంటున్న పాక్ ఫ్యాన్స్!
X

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అతని ఆట తీరు, షాట్స్ కొట్టే విధానాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దాయాది పాక్‌లోనూ విరాట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కోసారి వారు తమ ఫేవరేట్ క్రికెటర్‌పై అభిమానాన్ని చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఓ అభిమాని పట్టుకున్న పోస్టర్ వైరల్ అయ్యింది. దానిని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

'విరాట్ కోహ్లీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడాలని, ఈ గడ్డపై సెంచరీ చేయాలని ఆ పోస్టర్‌లో రాసి ఉంది.' దీనిపై షోయెబ్ స్పందిస్తూ.. గడాఫీ స్టేడియం వేదికగా ఓ ప్రేక్షకుడు ప్రేమను వ్యాప్తి చేయాలని చూస్తున్నాడని రాసుకొచ్చాడు. అయితే, పీఎస్ఎల్ సందర్భంగా విరాట్ కోహ్లీ పోస్టర్ పట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పాక్ అభిమానులు విరాట్‌ కోహ్లీపై అభిమానాన్ని చాటడాన్ని ఇండియన్ ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వెస్టిండీస్ సిరీస్ అనంతరం ప్రస్తుతం విరాట్ కోహ్లీ కి బీసీసీఐ పది రోజుల పాటు సెలవులు ఇచ్చింది.ఈ నెలలో శ్రీలంకతో జరిగే టీ20కి కూడా రన్ మిషన్ దూరం కానుండగా, మార్చి 4న జరిగే టెస్టు సిరీస్‌లో కనిపించనున్నాడు.

https://twitter.com/shoaib100mph/status/1495664903432122373?s=20&t=KWM-gdF28PR7V-tmd6y_UA

Advertisement

Next Story

Most Viewed