మరో 90 రోజుల్లో ఎన్నికలు.. ప్రకటించిన ప్రధాని..

by Javid Pasha |
మరో 90 రోజుల్లో ఎన్నికలు.. ప్రకటించిన ప్రధాని..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరో 90 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆదేశాలను ప్రధాని జారీ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి తెలిపారు. అయితే ఈ ఎన్నికలు జరిగేది మన దేశంలో కాదు.. పాకిస్తాన్‌లో. గత కొన్ని రోజులు పాకిస్తాన్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రదాని ఇమ్రాన్ ఖాన్‌పై సొంత పార్టీ సభ్యులే తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలతో కలిసి ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం జరపాలని ప్లాన్ చేశారు.

అయితే తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికలను ప్రకటించారు. రానున్న మరో 90 రోజుల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విషయాన్ని పాకిస్తాన్ సమాచార మంత్రి ఫరూఖ్ హబిబ్ తెలిపారు. అయితే ఎన్నికలు జరిగే వరకు కూడా ఇమ్రాన్ ఖాన్ రాజ్యాంగంలోని 224 ఆర్టికల్ ప్రకారం తన డ్యూటీస్‌లో కొనసాగుతారని తెలిపారు.



Advertisement

Next Story