మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డ ఒవైసీ

by Nagaya |
మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డ ఒవైసీ
X

దిశ, వెబ్ డెస్క్​ : ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసద్దుద్దీన్ ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో పెట్రోల్ ధర రూ.115 కు పెరగాడనికి కారణం తాజ్ మహాల్ నిర్మించడమే అని అన్నారు. షాజహాన్ తాజ్ మహల్ నిర్మించకుంటే నేడు పెట్రోల్ ధర లీటర్ రూ.40 కే లభించేందని బీజేపీ, పీఎం మోడీపై సెటైర్లు వేశారు. దేశంలోని అన్ని సమస్యలకు కారణం మొఘలులు, ముస్లింలే అని బీజేపీ నిందిస్తోందని మండిపడ్డారు. ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో నిరుద్యోగులు, ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఇంధన ధరలు మండిపోతున్నాయని వీటన్నింటికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ కాదని.. ఔరంగజేబు కారణం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడని, ఇంధన ధరలు పెరగడానికి తాజ్ మహల్ కట్టిన షాజహాన్ కారణం అవుతారని అన్నారు. అతను తాజ్ మహల్‌ను ప్రారంభించకపోతే, నేడు పెట్రోల్ రూ.40కే లభించేదని, తాజ్ మహాల్, ఎర్రకోటలను నిర్మించడం ద్వారా షాజహాన్ తప్పు చేశారని దుయ్యబట్టారు. షాజహాన్ ఈ నిర్మాణాలను చేపట్టకుండా ఆ డబ్బును 2014లో పొదుపు చేసి మోడీకి అప్పగించి ఉండాల్సిందని అన్నారు. ప్రతి సమస్యకు మొగలులను, ముస్లింలను బాధ్యులుగా చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని, భారత దేశాన్ని కేవలం మొఘలులే పాలించారా? అశోక చక్రవర్తి? చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ దృష్టిలో లోపం ఉందని వారు ఒక కంటితో మొఘల్‌లు, మరో కన్నులో పాకిస్తాన్‌ను చూస్తున్నారని మండిపడ్డారు.

భారతీయ ముస్లింలకు మొఘలులతో లేదా పాకిస్తాన్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ నేలపైనే తాము 75వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటామని అన్నారు. తామ పూర్వీకులు జిన్నా ప్రతిపాదనను తిరస్కరిచారని ఇందుకు భారత దేశంలోనే ఉన్న ఈ దేశానికి చెందిన 20 కోట్ల మంది ముస్లింలే సాక్ష్యం అని అన్నారు. తమది ఈ దేశమేనని, మీరు ఎన్ని నినాదాలు చేసినా తాము భారత్ ను విడిచిపోయేది లేదని అన్నారు. ఈ నేలపైనే జీవిస్తాం ఈ నేలపైనే మరణిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed