తీవ్ర వివాదంలో నమో యాప్.. నయవంచన అంటున్న యాక్టివిస్టులు

by Harish |
తీవ్ర వివాదంలో నమో యాప్.. నయవంచన అంటున్న యాక్టివిస్టులు
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రూపొందించిన నమో యాప్ తీవ్ర వివాదంలో చిక్కుకుపోయింది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ నమో యాప్‌లో ఆ స్కీముల జాబితాను పొందుపర్చడం నయవంచన అంటూ ఆర్టీఐ కార్యకర్తలు ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ విరాళాలను ప్రభుత్వ పథకాల కోసం వసూలు చేయడం లేదని బీజేపీ నేత ఒకరు ఆర్టీఐ ప్రశ్నకు స్పందించారు. వివిధ ప్రభుత్వ పథకాల జాబితాను పొందుపరుస్తూ వారి పేరుతో సూక్ష్మ విరాళాలను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన నమో యాప్ కోరింది. వాస్తవానికి ఇలా విరాళాలు అడగడానికి యాప్‌కి కానీ, ప్రభుత్వేతర సంస్థలకు కానీ అధికారం లేదని, చట్టపరంగా అనుమతి లేదని ఆర్టీఐ చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానమిచ్చింది.

స్వచ్ఛ్ భారత్, బేటీ బచావో, బేటీ పడావో వంటి పథకాల కోసం విరాళాల సేకరణకు నమో యాప్ ప్రయత్నించింది. అయితే నమో యాప్ ప్రభుత్వ పథకాలకు విరాళాలు సేకరించడం లేదని బీజేపీ ప్రతినిధి ఖండించారు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఆరోపణపై స్పందించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed