- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరిలో ఎనిమిది కీలక రంగాల వృద్ధి 3.7 శాతం!
దిశ, వెబ్‌డెస్క్: భారత ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 3.7 శాతానికి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో కీలక రంగాల్లో ఉత్పత్తి ఇది 1.3 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. సహజ వాయువు, బొగ్గు, సిమెంట్ పరిశ్రమల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. సమీక్షించిన నెలలో ముడి చమురు, ఎరువుల ఉత్పత్తి మినహా మిగిలిన అన్ని రంగాల్లో సానుకూల వృద్ధి నమోదైంది. అంతకుముందు 2021, డిసెంబర్‌లో కీలక రంగాల ఉత్పత్తి 4.1 శాతం క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తి గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 11.6 శాతం పెరిగాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 8.6 శాతం ప్రతికూలత నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. జనవరిలో బొగ్గు ఉత్పత్తి 8.2 శాతం, సహజ వాయువు 11.7 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 3.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 13.6 శాతం పెరిగాయి. ముడి చమురు 2.4 శాతం, ఎరువుల ఉత్పత్తి 2 శాతం క్షీణించాయి.