పార్లమెంట్‌లో చమురు ధరల సెగ..నిరసనగా ప్రతిపక్షాల వాకౌట్

by Mahesh |
పార్లమెంట్‌లో చమురు ధరల సెగ..నిరసనగా ప్రతిపక్షాల వాకౌట్
X

న్యూఢిల్లీ: కేంద్రం ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నాలుగు నెలల తర్వాత ఇంధన ధరలు పెంచడం తో విపక్షాలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే ధరలను నియంత్రించి, ముగియగానే యథావిధిగా పెంచుతున్నారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, డీఎంకే ఇతర పార్టీల నేతలు నినాదాలు చేశారు. వెంటనే ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా, మంగళవారం కేంద్రం ఇంధన ధరల పై రూ.80 పైసలు పెంచగా, వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచింది.

ధరల పెరుగుదలకు ఎన్నికలకు సంబంధం లేదని వారు వాదించారు. ఇది చాలా తప్పు. ఓటు వేయకముందు ఓటర్లను వారు నిరాశకు గురి చేయాలనుకోలేదు. ఇంధన ధరల పై కేంద్రం పన్ను 50 శాతానికి పైనే ఉందని మరచిపోకండి. కానీ వారు మాత్రం తగ్గింపు గురించి ఆలోచన చేయట్లేదు' అని కాంగ్రెస్ నేత శశిథరూర్ కేంద్రం పై విమర్శలు చేశారు. గతేడాది నవంబర్ తర్వాత మొదటి సారిగా ఇంధన ధరలు కేంద్రం పెంచింది. 2017 లో రోజువారీ ధరల్లో మార్పులు ప్రవేశపెట్టిన తర్వాత పెంపుదలలో సుదీర్ఘ విరామం ఇదే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed