ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలను మళ్లీ పరిశీలించే అవకాశం: ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్

by Harish |
ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలను మళ్లీ పరిశీలించే అవకాశం: ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. దీని ప్రభావం భారత్‌పై ఉంటుంది. (RBI)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి సమావేశంలో వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలను సమీక్షించవచ్చని RBI అధికారి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం 4%కి తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాకు భౌగోళిక రాజకీయ పరిణామాలు తలకిందులయ్యే ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని, ఏప్రిల్ సమావేశంలో అంచనాలను సమీక్షించే అవకాశం ఉందని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర తెలిపారు. ఇంతకుముందు GDP వృద్ధి సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేసిన 8.9% నుంచి 7.8%కి తగ్గుతుందని RBI తెలిపింది. అంతర్జాతీయ ముడి చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం ప్రభావానికి గురవుతుంది. ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధమైందని, ధరలు కూడా తగ్గించాలని ఆయన తెలిపారు.

Advertisement

Next Story