హైదరాబాద్‌లో Oppo 5G డెవలప్‌మెంట్ ల్యాబ్

by Harish |
హైదరాబాద్‌లో Oppo 5G డెవలప్‌మెంట్ ల్యాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: Oppo, దాని హైదరాబాద్ R&D సెంటర్‌లో "పవర్ అండ్ పెర్ఫార్మెన్స్" అభివృద్దిలో భాగంగా మూడవ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో ఇంతకుముందు కెమెరా, 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. Oppo అకాడెమియా, స్టార్టప్‌లతో భాగస్వామ్యం ద్వారా 5G "ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్" కోసం పని చేస్తోంది. 6G టెక్నాలజీ కోసం భారతీయ విద్యావేత్తలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5G, 6G సాంకేతికతలపై దృష్టి కేంద్రీకరించిందని, ఈ రంగాలలో సహకారాన్ని కలిగి ఉండాలని చూస్తున్నట్లు Oppo ఇండియా R&D హెడ్ తస్లీమ్ ఆరిఫ్ తెలిపారు. భారతదేశంలో మరిన్ని భాగస్వామ్యాలు ఉంటాయి. ఇది పరిశోధన సంబంధిత సహకారంపై విద్యాపరమైన శక్తిని ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. భారతదేశంలో పరిశోధన కోసం నిధులను కూడా అందజేస్తామని చెప్పారు. ఇండియాలో స్టార్టప్‌ల కోసం వారితో సహకరించడానికి కంపెనీ ఇటీవల ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని స్టార్ట్‌ప్‌లను ఎంపిక చేసింది. వాటికి మౌలిక సదుపాయాలు అందజేస్తామని R&D హెడ్ తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed