- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు
దిశ, బెజ్జంకి: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. కానీ తాగు నీటి వృథాను అరికట్టడంలో అధికారలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాారు. వారి నిర్లక్ష్యం కారణంగా మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్నాయి. బెజ్జంకి నుంచి కరీంనగర్ వైపు రాజీవ్ రహదారిని అనుకోని ఉన్న దాచారం గ్రామ శివారులో గల మిషన్ భగీరథ పథకంలో బాగంగా వేసిన తాగునీటి పైపు నుంచి నీరు వృధాగా పోతున్నాయి. కానీ దీని గురించి ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని మిషన్ భగీరథ సెక్షన్ పరిధిలో నిత్యం పలుచోట్ల పైపులైన్‌లు లీకేజీ అవుతుండడంతో తాగు నీరు వృధాగా పోతుందని ప్రజలు తెలుపుతున్నారు. దాచారం గ్రామ రాజీవ్ రహదారి పక్కన తాగు నీరు వృధాగా పోతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ లీకేజీలను గుర్తించి, తాగు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.